నిన్ను కోరి, మజిలీ వంటి ఫీల్ గుడ్ మూవీస్ తీసిన శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా టక్ జగదీష్ అనే చిత్రం ప్రారంభమైంది. నిన్ను కోరి తర్వాత నాని, శివ నిర్వాణ కలయిక లో వస్తున్న రెండో సినిమా ఇది. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ప్రముఖ నటుడు జగపతి బాబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది కలసి షైన్ స్క్రీన్స్ పతాకంపై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కోవిడ్ కి ముందే షూటింగ్ స్టార్ట్ అయినా లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. లాక్ డౌన్ తర్వాత ప్రభుత్వ మార్గదర్శకాలతో ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభమైంది. కానీ గత కొన్ని రోజులుగా ఈ సినిమా యూనిట్ లో ఒకరికి కరోనా వచ్చిందని, సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ అవేవి నిజాలు కావని దర్శకుడు శివ నిర్వాణ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన వీడియోతో తెలిసిపోయింది. “అన్ స్టాపబుల్ టక్ జగదీష్ 38th డే ఆన్ ది సెట్” అని ఒక మేకింగ్ వీడియో జత చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రహణం. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Unstoppable #Tuckjagadish
— Shiva nirvana (@ShivaNirvana) October 22, 2020
38th day on the sets👍 pic.twitter.com/FRXuWLZ1lp