ఈ ‘బాబాయి – అబ్బాయి’లకు 36 సంవత్సరాలు

హాస్య బ్రహ్మ జంద్యాల గారి దర్శకత్వంలో బాలకృష్ణ, అనిత జంటగా నటించిన చిత్రం ‘బాబాయి అబ్బాయి’. సుత్తి వీరభద్ర రావు, సుత్తి వేలు, రాజేంద్ర ప్రసాద్, రాళ్ళపల్లి లాంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకునేందుకు ఆమె తండ్రిని కలుస్తాడు మన హీరో. నే దెగ్గర డబ్బు లేదని ఎగతాళి చేస్తాడు ఆమె తండ్రి. డబ్బు సంపాదించడం పెద్ద సమస్య కాదని డబ్బు సంపాదించి తనని పెళ్ళి చేసుకుంటానని చెప్పగా, అతనికి కొంత డబ్బులిచ్చి కొన్ని షరతులు పెడతాడు. ఆ డబ్బును ఖర్చు చేసి రూపాయి కూడా మిగల్చకుండా, ఎటువంటి ఆదాయమూ ఆ డబ్బు నుండి సంపాదించకూడదని చెప్పి నెల రోజులు గడువు ఇస్తాడు. అతను ఎప్పుడైతే ఆ డబ్బును పూర్తిగా ఖర్చు చేస్తాడో అప్పుడు తన కూతురిని ఇచ్చి పెళ్ళి చేస్తానని మాట ఇస్తాడు. అతనిచ్చిన డబ్బుని చిటికెలో ఖర్చు చేస్తానని చెప్పి వెళ్ళిన అతనికి ఆ డబ్బు రెట్టింపు అవుతూ వస్తుంది. అలా అతను కోటీశ్వరుడు అవతాడు. ఎంత ఖర్చు చేసినా ఆ డబ్బు రెట్టింపు అవుతూ వస్తుందే కాని తరగదు. ఓడిపోయానన్న బాధలో ఉన్న అతన్ని ఆమె తండ్రి కలిసి నీ క్యారెక్టర్ తెలుసుకోడానికే ఇలా చేసానని, కష్టపడకుండా వచ్చే డబ్బు మనల్ని మనఃశాంతిగా ఉండనివ్వదని చెప్పడంతో కథ సుఖాంతమవుతుంది. ఒక మంచి మెసేజ్ ను క్యారీ చేస్తూ జంధ్యాల గారు తన మార్క్ కామెడీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలైన మొదటి నుండి హిట్ టాక్ తెచ్చుకుని ఇద్దరి కెరీర్ లలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.