
టాలీవుడ్ లో వారసులకి కొదువలేదు.. హీరోల కొడుకులే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న అన్ని క్రాఫ్ట్ లకి సంబందించిన వారి వారసులు సినిమాల్లో హీరోలుగా వచ్చారు.. వారు సక్సెస్ అయ్యారా లేదా అన్నది వేరే విషయం అయినా ఇలా వచ్చి అలా వెళ్ళినవారు ఎక్కువమంది ఉన్నారు.. ఈనేపథ్యంలో టాలీవుడ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వెలుగొందిన సాయి కుమార్ తనయుడు ఆది కూడా వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే ప్రేమకావాలి సినిమాతో మంచి హిట్ కొట్టాడు..

అరెరే భలే చేశాడు కుర్రాడు అనిపించుకున్నాడు.. తండ్రి రేంజ్ లో కాకపోయినా ఆది తనకున్న టాలెంట్ ను ఆ సినిమా చూపించి పర్వాలేదనిపించారు.. ఇక రెండో సినిమా ప్రయత్నంగా చేసిన లవ్ లీ కూడా హిట్ అవడంతో ఆదికి మంచి ఫ్యూచర్ ఉందనుకున్నారు.. అయితే ఆ సినిమా తర్వాత ఆదికి ఇప్పటివరకు కూడా సరైన హిట్ పడలేదంటే ఆది స్టోరీల ఎంపిక ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. సుకుమారుడు పర్వాలేదనిపించుకున్న ఆ తర్వాత చేసిన సినిమాలు ఎందుకు చేశాడో కూడా అర్థం కావట్లేదు..

అయితే ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పటినుంచి జరిగేది ఒక ఎత్తులా ఉంది ఆది కెరీర్.. అయన తాజాగా శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో కొంత డిమాండ్ ఏర్పడగా ఇప్పుడు ఈ సినిమాకి ఓవరాల్ గా బిజినెస్ బాగానే జరిగింది, నైజాంలో కోటి బిజినెస్ ను సీడెడ్ లో 50 లక్షల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ ఆంధ్రా లో 1.5 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 3 కోట్ల దాకా బిజినెస్ ను సాధించగా మిగిలిన చోట్ల మరో 20 లక్షల రేంజ్ బిజినెస్ ను సాధించింది. దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 3.5 కోట్లకు తగ్గని కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాలి. అసలే హిట్ టాక్ లేక 9 ఏళ్ళు అవుతున్న ఆదికి ఈ సినిమా ఇప్పుడు చాలా ఇంపార్టంట్ అని చెప్పొచ్చు.