మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తోన్న తాజా సినిమా ‘క్రాక్’. ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. రీసెంట్ గా టీమ్ మొత్తం గోవా వెళ్ళి ఒక పాటను చిత్రీకరించారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయినట్లే. ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్లే ప్రమోషన్స్ కూడా నడుస్తున్నాయి. ఇటీవలే క్రాక్ సినిమాలోని మొదటి పాటను విడుదల చేసిన విషయం తెల్సిందే. భూమ్ బద్దలు అంటూ సాగే ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ.ర్జీ.వీ భామ అప్సరా రాణి ఈ పాటలో స్పెషల్ రోల్ చేసింది. ఇక లేటెస్ట్ గా క్రాక్ సెకండ్ సింగిల్ ను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. డిసెంబర్ 14న ఈ పాటను విడుదల చేస్తారు. ఈ పాటకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ పాటను పాడాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.