‘హలో బ్రదర్’... “ఇది వైవిధ్యభరితమైన రోమాన్స్-కామెడి”

“కన్నె పిట్టరో కన్ను కొట్టరో....” ఈ పాట వింటే చాలు ఇప్పటికీ మనకు తెలియకుండానే రిథమ్ కి తగ్గట్లుగా పాటను హమ్ చేస్తుంటాం. పెద్దగా దీని గురించి పరిచయం అవసరం లేకుండానే ఆ పాటేంటో, ఆ సినిమా ఏంటో అందరికీ అర్ధమైపోతుంది. ఆ సినిమా అలాంటిది మరి అందులో వాళ్ళు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ప్రతీ సీన్ మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. కామెడి, యాక్షన్, సెంటిమెంట్, డ్రామా అన్ని కలగలిసిన ఉగాది పచ్చడి ఈ సినిమా. అచ్చం ఒకేలా ఉండే కవలలు ఒకరేమో చిల్లర దొంగతనాలు చేసుకుంటూ ఉండేవాడు, ఇంకొకడు రాక్ స్టార్. వీళ్ళిద్దరినీ పోల్చుకోవడంలో హీరోయిన్ల పొరపాట్లు, దాని వల్ల వచ్చే సిచ్యువేషనల్ కామెడి చాలా బాగుంటుంది. కోటా-మల్లికార్జున రావుల కామెడి గురించి ప్రేత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

నట సామ్రాట్ నాగార్జున కథానాయకుడిగా ఈ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘హలో బ్రదర్’. నాగార్జున ద్విపాత్రాభినయం చేయగా సొందర్య, రమ్యకృష్ణన్ లు ఆయనకు జంటగా నటించారు. శరత్ బాబు, గిరిబాబు, కోటా శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, బ్రహ్మానందం, శ్రీహరి, చరణ్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రాజ్-కోటి సంగీతం అందించగా శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్ నారయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర షూటింగ్ ప్రియరాగాలే పాటతో మొదలైంది. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమా పాటలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాకి కొరియోగ్రాఫర్లుగా ప్రభుదేవా, రాజు సుందరం, తారాలు పనిచేసారు. ముఖ్యంగా ప్రియరాగాలే పాటలో అప్పటివరకూ నాగార్జునతో ఎవరూ వేయించని స్టెప్స్ వేయించారు ప్రభుదేవా. రాజ్-కోటి ద్వయం అందిచిన సంగీతం అయితే అప్పట్లో ఒక ఒఊపు ఊపింది.

ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి నాగార్జున నటన, ఈవివి ప్రతిభ. రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లోని వేరియేషన్స్ ని ఆయన అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేసారు. దొంగగా, రాక్ స్టార్ గా ఆ పాత్రలను ఆయన ఓన్ చేసుకున్న విధానం బాగుంటుంది. సీన్స్ ఎక్కడా బోరింగ్ గా అనిపించవు. ప్రతీ సీన్ లోను కామెడిని పొంగేలా చేసారు దర్శకుడు. ఈ చిత్రం ఇక్కడ బ్లాక్ బస్టర్ అయ్యి హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ కూడా అయ్యింది. అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. నాగార్జున కెరీర్ లో ఒక మంచి కమర్షియల్ హిట్ గా ఉండే ఈ సినిమా విడుదలై 27 ఏళ్ళు అయింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.