నటసింహం నరసింహ నాయుడికి 20 వసంతాలు

నందమూరి బాలకృష్ణ, బి. గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన నరసింహ నాయుడు ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో వరుసగా విజయం సాధించిన నాల్గవ చిత్రంగా 'నరసింహనాయుడు' నిలచిపోయింది. జనవరి 11 , 2001 న విడుదలై ఈ  సినిమా ఈరోజు తో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కి జోడిగా సిమ్రాన్, ప్రీతి జంగ్యాని నటించారు. విలన్స్ గా జయ ప్రకాష్ రెడ్డి, ముఖేష్ రిషి నటన కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు. విడుదలైన అన్ని కేంద్రాలలో నరసింహ నాయుడు ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది. ఈ సినిమా 105 కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. ఇది అప్పట్లో అల్ టైం రికార్డ్. అలాగే ఈ సినిమా  మినీ అంబికా థియేటర్ లో ఏకధాటిగా 275 రోజులు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమాల్లో దాదాపుగా 25 కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా నరసింహ నాయుడు రికార్డ్ నెలకొల్పింది. ఇక ఈ సినిమాలో ట్రైన్ లో బాలకృష్ణ దిగుతుంటే చూసి విలన్స్ పారిపోవడం లాంటి సీన్స్ కి ఇప్పటికి భారీ ఆదరణ ఉంది. ఈ సినిమా తెలుగులో ఫ్యాక్షన్ కథల ట్రెండ్ ని ఇంకా పెంచింది. లక్స్ పాపా సాంగ్, నిన్నా కుట్టేసినాది మొన్న కుట్టేసినాది పాటలు అప్పట్లో మారుమోగిపోయేవి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.