
మహేష్ బాబు కేరీర్ లో బ్లాక్ బస్టర్స్ చాలానే ఉన్నప్పటికీ ఆ సినిమాల్లో ఒక్కడు సినిమా చాలా ప్రత్యేకం. అప్పటిదాకా ప్రిన్స్ గా కనిపించే మహేష్ బాబులో మాస్ యాంగిల్ కూడా ఉందని అందరికి తెలిసేలా చేసింది ఒక్కడు సినిమా. జనవరి 15 2003న విడుదలైన ఒక్కడు సినిమా ఈరోజుతో 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర సాదా సీదాగా తిరిగే ఒక కుర్రోడు తనతో వచ్చిన అమ్మాయి కోసం కర్నూల్ ఫ్యాక్షనిస్ట్ ని ఎలా ఎదురుకున్నాడు అనే కథతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టింది. ఒక్కడు సినిమాలో మహేష్ యాక్షన్, భూమిక నటన, ప్రకాష్ రాజ్ విలనిజం సినిమాకి హైలైట్. మణిశర్మ అందించిన చెప్పవే చిరుగాలి, సాహసం శ్వాసగా సాగిపో లాంటి పాటలు మనం ఇప్పటికే వింటుంటే ఉంటాం. అలాగే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చార్మినార్ సెట్ వెయ్యడం విశేషం. ఇక ఈ సినిమాని నిర్మించిన ఎమ్మెస్ రాజు గారి సినిమాల్లో ‘ఒక్కడు’ ఒక మైలు రాయి.ఇక ఇదే సినిమాను తమిళంలో విజయ్, త్రిష జంటగా ‘గిల్లి’ పేరుతో రీమేక్ చేస్తే భారీ విజయాన్ని అందుకుంది. కన్నడలో ‘అజయ్’, బెంగాలీలో ‘జోర్’, హిందీలో ‘తేవర్’ పేర్లతో రీమేక్ చేస్తే అక్కడా విజయం సాధించింది.