‘11th అవర్’ ఫస్ట్ లుక్ విడుదల

చందమామ కథలు, గుంటూర్ టాకీస్, పి.ఎస్.వి గరుడవేగ ఇలా డిఫరెంట్ జానర్లలో సినిమాలు తీసే దర్శుకుడు ప్రవీణ్ సత్తారు తాజాగా “11th అవర్”  వెబ్ సీరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో తమన్నా నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇదే. ప్రదీప్.యు నిర్మాత మరియు రచయిత కూడా. త్వరలో ఆహా ఓ.టి.టి లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా టైటిల్ లాంచ్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఆహా అధినేత అల్లు అరవింద్ మాట్లాడుతూ “సిరీస్ నిర్మాత, రచయిత ప్రదీప్ కథ చెప్పినప్పుడు స్టార్ హీరోయిన్, దర్శుకుడు కలిసి చేస్తే బావుంటుందని అనిపించింది. వెంటనే తమన్నాకి ఫోన్ చేస్తే అంగీకరించింది. ప్రవీణ్ సత్తారు ఏ జానర్ లో సినిమా చేసినా చక్కగా తెరకెక్కించగలడు. అందుకని అతడి చేతిలో పెట్టాము. ఇది విడుదల కాకుండానే మాకు మరో సిరీస్ చేయమని ప్రదీప్ ని అడిగా. తను అంత మంచి రచయిత.” అని అన్నారు. హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ “అరవింద్ గారి చిత్రాల వల్లే యాక్టర్ నుంచి స్టార్ అయ్యాను. ఇప్పుడీ సిరీస్ తో స్టార్ నుంచి మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకుంటానని ఆశిస్తున్నా” అని అన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ “ఇది ఒక బోర్డ్ రూమ్ డ్రామా కథ, ఒక రాత్రిలో జరిగే కథ, పురుషాధిక్య ప్రపంచంలో ఒక అమ్మాయి తన కలల్ని ఎలా నిజం చేసుకుందనేది ఇందులో ఆసక్తికరంగా ఉంటుంది” అని అన్నారు. “తన స్నేహితుడు రాసిన “8 అవర్స్” అనే పుస్తకం నుండి తయారు చేసిన కథ ఇది. ఒక మంచి బృందం తో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించా” అని రచయిత, ప్రొడ్యూసర్ ప్రదీప్ అన్నారు. ఈ సిరీస్ కి ఛాయాగ్రహణం: ముఖేష్ జి, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్ల.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.